జాట్ నుంచి ‘టచ్‌కియా’ ఫస్ట్ సింగిల్ రాబోతుందంటూ ఆ బ్యూటీ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. పోస్ట్ వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-04-01 15:35:33  IST  )

టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni), బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్(Sunny Deol) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’(JAAT).

జాట్ నుంచి ‘టచ్‌కియా’ ఫస్ట్ సింగిల్ రాబోతుందంటూ ఆ బ్యూటీ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni), బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్(Sunny Deol) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’(JAAT). పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని(Naveen Yerneni), వై రవిశంకర్(Ravi Shankar) నిర్మిస్తున్నారు. అయితే పలు హిట్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు రూపొందిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఈ చిత్రానికి ఎస్ తమన్(Thaman) బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. ఇందులో వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా(Randeep Hooda) ఇందులో పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది.

ఇక ఇప్పటికే ‘జాట్’ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ అందరిలో క్యూరియాసిటీని పెంచాయి. తాజాగా, ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘టచ్ కియా’(Touch Kiya) సాంగ్ ఏప్రిల్ 1న రిలీజ్ కాబోతుందని వెల్లడించారు. ఇక ఈ బ్యూటీ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో చిందులేయనుండటంతో సినీ ప్రేక్షకులు ఫులు ఖుషీ అవుతున్నారు.

Next Story