‘తన్వి ది గ్రేట్’ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. వాటిని విచ్ఛిన్నం చేయాలని ఎంచుకుందంటూ పోస్ట్

by Mallepaka Hamsa |

యంగ్ బ్యూటీ శుభాంగి(Shubhangi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘తన్వి ది గ్రేట్’(Thanvi the Great).

‘తన్వి ది గ్రేట్’ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. వాటిని విచ్ఛిన్నం చేయాలని ఎంచుకుందంటూ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శుభాంగి(Shubhangi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘తన్వి ది గ్రేట్’(Thanvi the Great). ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనుపమ్ ఖేర్(Anupam Kher) తెరకెక్కిస్తున్నారు. అయితే దీనిని అనుపమ్ ఖేర్ స్టూడియోస్, ఎన్‌ఎఫ్డిసి బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాను 2025 కేన్స్ ఫిల్మ్స్ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించనున్నారు. ఇక ఇందులో అరవింద్ స్వామి(Arvind Swami), ఇయాన్ గ్లెన్, జాకీష్రాఫ్, బొమన్ ఇరానీ, పల్లవి జోషి, నాజర్, కరణ్‌టాకర్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక గత కొద్ది రోజుల నుంచి మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.

తాజాగా, చిత్రబృందం ‘తన్వి ది గ్రేట్’ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ చిత్రం జూలై 18న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇక ఇక ఇందులో ఆర్మీ ఆఫీసర్లు మార్చ్ ఫస్ట్ చేస్తుండగా.. వారి మధ్యలో నిల్చున్న శుభంగి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇక ఈ పోస్టర్‌కు అనుపమ్ ఖేర్ ‘‘అంతా ఆమెను వాళ్ళు భిన్నంగా పిలిచారు. కానీ ఆమె దానిని ఎప్పుడూ బలహీనతగా చూడలేదు. ప్రపంచం ఆమెను పెట్టెల్లో అమర్చడానికి ప్రయత్నించగా, తన్వి వాటిని ఒక్కొక్కటిగా విచ్ఛిన్నం చేయాలని ఎంచుకుంది. ‘తన్వి ది గ్రేట్’ భిన్నంగా ఉండటం వల్ల.. తక్కువ కాదని అది మిమ్మల్ని ఆపలేనివారిగా మారుస్తుందని గుర్తు చేస్తుంది. ఈ సినిమా మొదటి పోస్టర్‌ను ఆవిష్కరించడం ద్వారా బలం, కలలు.. ఆపలేని ధైర్యం యొక్క కథ అని తెలియజేశాం’’ అని రాసుకొచ్చారు.

Next Story