- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మన భాష అల్లం.. ఇతర భాష బెల్లమా?’.. టికెట్స్ రేట్స్ పెంపుపై నెటిజన్ల ఫైర్
హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) కాంబినేషన్‌లో రాబోతున్న వార్-2(war -2), రజనీకాంత్ - నాగార్జున(Nagarjuna) కాంబినేషన్‌లో వస్తోన్న కూలీ(Coolie) సినిమాలు ఆగష్టు 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) కాంబినేషన్‌లో రాబోతున్న వార్-2(war -2), రజనీకాంత్ - నాగార్జున(Nagarjuna) కాంబినేషన్‌లో వస్తోన్న కూలీ(Coolie) సినిమాలు ఆగష్టు 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలకు తెలుగు ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. అటు ఏపీ, ఇటు తెలంగాణ రెండు ప్రభుత్వాలు టికెట్ల రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. సినిమా విడుదల రోజు నుండి 23/08/2025 వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75 టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు మంజూరు చేశాయి. అయితే.. ఈ టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పెద్ద హీరోల సినిమాల విడుదల ఉన్నప్పుడల్లా ఇలా ఇష్టానుసారం టికెట్ల రేట్లు పెంచితే.. సామాన్యులు ఎలా చూస్తారని మండిపడుతున్నారు. తెలుగు హీరోల సినిమాలంటే ఓకే.. ఇతర భాషల సినిమాలకు కూడా భారీ స్థాయిలో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడం సరికాదని మూవీ లవర్స్ నెట్టింట చర్చించుకుంటున్నారు.






