- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూపర్ ప్లాన్ వేసిన 'గాయపడ్డ సింహం' యూనిట్.. దెబ్బకు సేఫ్ అయింది.
గాయపడ్డ సింహం మూవీకి నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో 9 కోట్లు, థియేట్రికల్ బిజినెస్ 6 కోట్లు జరిగినట్లు తెలుస్తుంది. దాంతో ఇప్పటికే ఈ సినిమా మూడు కోట్ల లాభాలను అందుకొని సేఫ్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లయితే ఏదైనా ఒక సినిమా విడుదలయితే దానికి యావరేజ్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్లు దక్కేవి. అదే హిట్టు, బ్లాక్బస్టర్ టాక్ వచ్చిన సినిమాలు భారీ లాభాలను అందుకునేవి. కానీ ప్రస్తుతం చాలా వరకు పరిస్థితులు మారాయి. ఏదైనా సినిమా విడుదల అయ్యి దానికి యావరేజ్, ఎబోవ్ యావరేజ్ టాక్ వచ్చిందంటే అవి దాదాపు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అవుతున్నాయి. అద్భుతమైన సినిమా అని టాక్ వస్తే మాత్రమే మంచి లాభాలను అందుకుంటున్నాయి.
చిన్న సినిమాల విషయానికి వస్తే చాలా తక్కువ సినిమాలు మాత్రమే విడుదలకు ముందు టేబుల్ ప్రాఫిట్ను అందుకుంటున్నాయి. అలా విడుదలకు ముందే లాభాలను అందుకోవాలంటే నిర్మాతల ముందు ఉన్న ఏకైక అస్త్రం ప్రమోషన్స్. మూవీ బృందం ప్రమోషన్ల ద్వారా జనాలను విపరీతంగా ఆకట్టుకున్నట్లయితే తక్కువ బడ్జెట్ సినిమాలు కాబట్టి ఈజీగా టేబుల్ ప్రాఫిట్ను అందుకునే అవకాశాలు ఉంటాయి. తాజాగా తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో రూపొందిన గాయపడ్డ సింహం సినిమా విడుదలకు ముందే లాభాలను అందుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను దాదాపు 12 కోట్ల రూపాయలతో నిర్మించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో 9 కోట్లు, థియేట్రికల్ బిజినెస్ 6 కోట్లు జరిగినట్లు తెలుస్తుంది. దాంతో ఇప్పటికే ఈ సినిమా మూడు కోట్ల లాభాలను అందుకొని సేఫ్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయకృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మిస్తున్నారు.






