- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల రోజులు కాకుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్-2’.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
నార్నే నితిన్(Narne Nitin), సంగీత్ శోభన్(Sangeet Shobhan), రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ చిత్రం ‘మ్యాడ్’.

దిశ, సినిమా: నార్నే నితిన్(Narne Nitin), సంగీత్ శోభన్(Sangeet Shobhan), రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ చిత్రం ‘మ్యాడ్’. కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) దర్శకత్వంలో ఈ సినిమాను సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర హారిక, సాయి సౌజన్య(Sai Soujanya) నిర్మించిన ఈ సినిమా 2023లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక రెండేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్-2’(Mad Square-2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar) ఐటమ్ సాంగ్ చేసింది. ‘మ్యాడ్’ నటీనటులతో కొనసాగిన ఈ సీక్వెల్ మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయాన్ని సాధించింది.
అంతేకాకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్‌లోని జనాలను కడుపుబ్బా నవ్వించింది. తాజాగా, ‘మ్యాడ్ స్క్వేర్-2’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఏప్రిల్ 25 నుంచి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. అయితే కేవలం 28 రోజులకే ‘మ్యాడ్ స్క్వేర్-2’ ఓటీటీలోకి రాబోతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
The boys are back with double the MADness! 🤪
— Netflix India South (@Netflix_INSouth) April 21, 2025
Watch Mad Square on Netflix, out 25 April in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam.#MadSquareOnNetflix pic.twitter.com/0WGsRj2Sgc






