- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సీన్ కోసం ఏకంగా 37 టేకులు తీసుకున్న హీరోయిన్.. తలనొప్పిగా మారిందంటూ హీరో షాకింగ్ కామెంట్స్
సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ లేకుంటే సినీ ప్రేక్షకుల బోర్‌గా అనిపిస్తుంటుంది. కొన్ని చిత్రాల్లో మాత్రం ఈ సీన్స్ మరీ ఎక్కువగా ఉంటాయి.

దిశ, సినిమా: సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ లేకుంటే సినీ ప్రేక్షకుల బోర్‌గా అనిపిస్తుంటుంది. కొన్ని చిత్రాల్లో మాత్రం ఈ సీన్స్ మరీ ఎక్కువగా ఉంటాయి. అయితే షూటింగ్ జరిగేటప్పుడు ఇలాంటివి చేయలేక కొంతమంది ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి సన్నివేశాలు దాదాపు సింగిల్ టేక్‌లో క్లోజ్ చేస్తుంటారు డైరెక్టర్లు. ఏదైనా సీన్స్‌లో హీరోహీరోయిన్లు సీన్స్ పండించకపోతే ఒకటి లేదా రెండు టేకులు తీసుకుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం 37 టేకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే.. డైరెక్టర్ అనుకున్న విధంగా ఆ సీన్ రాకపోవడంతో అలా చేసినట్లు తెలుస్తోంది. తాజాగా, ఇదే విషయంపై బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ముద్దు సీన్ కూడా తలనొప్పిగా మారుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ‘కాంచి’ సినిమాలో ఓ కిస్ సీన్ ఉంటుంది. లవర్స్‌గా నటించిన మిస్తి నేను ముద్దు పెట్టుకోవాలి. అయితే షూటింగ్ సమయంలో ఇద్దరం కలిసి కిస్ చేసుకున్నాం. కానీ దర్శకుడు సంతృప్తి చెందలేదు.
కట్ చెప్పేసి మళ్లీ ముద్దు పెట్టుకోమన్నాడు. అలా మొత్తం ఆయన మాతో 37 టేకులు తీసుకున్న తర్వాత ఓకే చేశారు. అలా చేయడంతో తప్పు లేదు కానీ మిస్తి(Mishti Chakraborty) ఎక్కడ నన్ను అపార్థం చేసుకుంటుందో అని కాస్త భయపడ్డాను. అయినప్పటికీ డైరెక్టర్ చెప్పినట్లుగానే ముద్దు పెట్టుకున్నాం. ఒకానొక దశలో నాకే చిరాకు వేసింది.
ముద్దు పెట్టుకోవడం రావట్లేదని ఎలా పెట్టుకోవాలో మీరు చేసి చూపించండి సార్ అని అడగాలనిపించింది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా. 2014లో వచ్చిన ‘కాంచి’ చిత్రంలో మిస్తి, కార్తీక్ ఆర్యన్ జంటగా నటించారు. అయితే దీనిని సుభాష్ గయ్(Subhash Guy) తెరకెక్కించారు. మిథున్ చక్రవర్తి(Mithun Chakravarthy), రిషి కపూర్, ముఖేష్ భట్(Mukesh Bhatt) కీలక పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది.






