- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వామ్మో వాయ్యో అంటూ ఆ ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్.. ఎందుకు ఇంత హాట్‌గా ఉన్నావంటూ కామెంట్స్
మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) నటిస్తున్న తాజా సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bartha Mahashayulaku Vignapthi).

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) నటిస్తున్న తాజా సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bartha Mahashayulaku Vignapthi). కిశోర్ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్(Ashika Ranganath), డింపుల్ హయాతి(Dimple Hayathi) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక దీన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చి సాంగ్స్, టీజర్స్, పోస్టర్స్ అన్నీ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
అయితే తాజాగా ఈ సినిమాలోని ‘వామ్మో.. వాయ్యో..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియా తనదైన మాస్ బీట్స్‌తో స్వరపరిచిన ఈ పాటకు దేవ్ పవార్ సాహిత్యం అందించగా, స్వాతి రెడ్డి తన గాత్రంతో పాటకు మరింత హుషారుని తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో తాజాగా ఆషికా రంగనాథ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది.
అందులో వామ్మో వాయ్యో సాంగ్ కోసం తాను రెడీ అయినది, డ్యాన్స్ స్టెప్స్ నేర్చుకున్నది, ఈ పాట టైంలో తీసుకున్న ఫొటోలను షేర్ చేస్తూ.. ‘వామ్మో వాయ్యో.. మొట్టమొదటి మాస్ తెలుగు పాట. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, నేను నా హృదయాన్ని నింపుకుని వెనకడుగు వేయకుండా డ్యాన్స్ చేశాను. అన్ని ప్రయత్నాలు, కష్టమంతా ప్రతి పనికి విలువ.. పిచ్చి ప్రేమకు ధన్యవాదాలు .. అలాగే శేఖర్ మాస్టర్, రవితేజ, డింపుల్ హయాతీకి కూడా థాంక్యూ’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు ఎందుకు ఇంత హాట్‌గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.






