- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ సేకరణ వేగవంతం చేయాలి: ఆర్ అండ్ ఆర్ కమిషనర్
భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల అమలులో వేగం పెంచాలని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివ కుమార్ నాయుడు తెలిపారు.

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల అమలులో వేగం పెంచాలని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివ కుమార్ నాయుడు తెలిపారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు, జెన్కో, సింగరేణి సంస్థలకు జరుగుతున్న భూసేకరణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి రెవెన్యూ, సర్వే, సింగరేణి, జెన్కో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ దృష్ట్యా ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, నిర్వాసితులకు అందించాల్సిన పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీలను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీలను ఆలస్యం లేకుండా, నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకతతో అందించాలన్నారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు...
ప్రభుత్వం ఈ అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలు, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంపొందిస్తూ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎటువంటి ఫిర్యాదులకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భూ సేకరణ పూర్తి అయితే తక్షణమే ఇరిగేషన్ శాఖకు భూములను అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి, కాటారం ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, జెన్కో సీఈ శ్రీ ప్రకాష్, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి, అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.






