- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లిపై స్పందించిన హీరోయిన్.. నాకు ఇద్దరు లవర్స్ ఉన్నారంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చిందిగా?
తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన వేదిక(vedhika) అందరికీ సపరిచితమే.

దిశ, సినిమా: తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన వేదిక(vedhika) అందరికీ సపరిచితమే. ‘మద్రాసి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక తెలుగులో ఈ అమ్మడు కళ్యాణ్ రామ్ నటించిన ‘విజయ దశమి’(Vijayadashami) మూవీతో వచ్చింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక గత ఏడాది ‘రజాకార్’ (Razakar)సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ‘ఖజానా’ చిత్రంలో నటిస్తోంది. స్క్వేర్ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రధీప్ శ్యామ్స్ స్వీయ దర్శకత్వంలో రాబోతుంది. అయితే ఇందులో యోగి బాబు(Yogi Babu, ), చాందిని నాన్ కడవుల్ రాజేంద్రన్, ప్రతాప్ పోతన్, బియాండ్, సెండ్రాయన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, నెటిజన్లతో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా ఆమె షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ‘‘నా జీవితంలో ఇద్దరు ప్రేమికులు ఉన్నారు. వాళ్లు నా చివరి వరకు నాతోనే ఉంటారు. వారిలో ఒకటి నా తల్లి ప్రేమ.. అది నా ఫస్ట్ లవ్. రెండోది డ్యాన్స్.. అది అంటే నాకు పిచ్చి. ఖాళీ సమయం దొరికితే చాలు నేను డ్యాన్స్ చేస్తూ ఉంటాను. ఈ రెండు ప్రేమలు చివరివరకు నాతోనే ఉంటాయి. అయితే మగవారిపై ప్రేమ పుట్టినప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వేదిక కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.






