- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీవితం పోర్షన్ కంట్రోల్‌గా మారిందంటూ షాకింగ్ పోస్ట్ పెట్టిన హీరోయిన్.. చాలా చేంజ్ అయ్యావంటూ నెటిజన్ల కామెంట్స్
ఒకప్పటి హీరోయిన్ ఛార్మీ కౌర్(Charmy Kaur) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ ఛార్మీ కౌర్(Charmy Kaur) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘హనుమాన్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె తన అందం, నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్స్ రవితేజ, ఎన్టీఆర్, మోహన్ బాబు, ప్రభాస్(Prabhas), వెంకటేష్(Venkatesh), బాలకృష్ణ, నాగార్జున వంటి వారితో నటించి ఫేమ్ సంపాదించుకుంది. ఇక హిందీ, తమిళ భాషల్లోనూ పలు సినిమాలు చేసింది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ (Liger)చిత్రంతో నిర్మాతగా మారిన చార్మీ పూరి జగన్నాథ్‌తో కలిసి పని చేస్తోంది . అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మెప్పించకపోవడంతో భారీ నష్టాల పాలైంది. ఆ తర్వాత చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’ కాస్త మెప్పించడంతో వరుస చిత్రాలు ప్రకటిస్తున్నారు.
ప్రస్తుతం చార్మీ, పూరి జగన్నాథ్ కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో ఓ మూవీ చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. తాజాగా, చార్మీ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. తాను డైట్ చేస్తున్నట్లు తెలుపుతూ ఆహారాన్ని గ్రాముల్లో తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఆప్లేట్‌తో పాటు పలు ఆహార పదార్థాలు జోకుతున్న ఫొటోలను షేర్ చేయడంతో అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఇక ఈ పోస్ట్‌కు ఆమె జీవితం పోర్షన్ కంట్రోల్‌గా మారింది. నా ఉద్దేశ్యం మీకు తెలిస్తే? కొన్ని తగ్గాయి, మరికొన్ని వెళ్లాయని అర్థం అవుతుంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక అది చూసిన ఓ నెటిజన్లు ఇది మెకానికల్ లైఫ్ అని కామెంట్ పెట్టగా.. మరో వ్యక్తి ఏఐ జనరేటెడ్ ఫొటోలా ఉంది.. నువ్వు నిజంగా చాలా మారిపోయావ్ అని అంటున్నాడు.






