అదిరిపోయే అవుట్ ఫిట్‌లో కిర్రాక్ అనిపిస్తున్న హీరోయిన్.. సూపర్ సూపర్ అంటున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-05 06:18:50  IST  )

కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అదిరిపోయే అవుట్ ఫిట్‌లో కిర్రాక్ అనిపిస్తున్న హీరోయిన్.. సూపర్ సూపర్ అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన ‘అమిగోస్’(Amigos) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

అలా కింగ్ నాగార్జున(Nagarjuna) సరసన ‘నా సామి రంగా’(Na Saami Ranga) చిత్రంలో నటించింది. ఈ మూవీలో ఈ భామ, యాక్టింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక రీసెంట్‌గా కన్నడ స్టార్ హీరో సిద్ధార్థ్(Sidharth) సరసన ‘మిస్ యూ’(Miss You) మూవీలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న ‘విశ్వంభర’(Vishwambhara) సినిమాలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో తన గ్లామర్ డోస్‌తో అమాంతం కుర్రకారును రెచ్చగొతున్న అషికా తాజాగా తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ట్రెడిషనల్ లుక్‌లో క్యూట్‌గా కనిపించింది. మెడల హారం మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, జడ వేసుకుని అచ్చతెలుగు ఆడపిల్లలా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సూపరో సూపర్ అంటూ కామెట్స్ చేస్తున్నారు.

Read More..

నా జీవితంలోకి దారి చూపినందుకు ధన్యవాదాలు అంటూ లవ్ సింబల్ జోడించి రష్మిక మందన్న పోస్ట్


Next Story