వడా పావ్ కోసం అక్కడ వీధుల్లో తిరుగుతున్న హీరోయిన్.. అది సరే కానీ ఈ బోల్డ్ షో ఏంటి అని నెటిజన్ల కామెంట్స్.. వీడియో వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-05 04:16:29  IST  )

బాలీవుడ్ ఫైర్ పటాక పూనమ్ పాండే(Poonam Pandey) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

వడా పావ్ కోసం అక్కడ వీధుల్లో తిరుగుతున్న హీరోయిన్.. అది సరే కానీ ఈ బోల్డ్ షో ఏంటి అని నెటిజన్ల కామెంట్స్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫైర్ పటాక పూనమ్ పాండే(Poonam Pandey) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఏదో ఒక వివాదంతో వైరల్ అవుతునే ఉంటుంది. హీరోయిన్‌గా కన్నా సోషల్ మీడియా ఫ్రభావంతోనే ఈ ముద్దుగుమ్మ ఫుల్ ఫేమస్ అయింది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. పూనమ్ పాండే వడా పావ్ కోసం ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతోంది. స్వయంగా తానే వచ్చి వడా పావ్‌ను కొనుక్కొని రోడ్డు పైనే తింటుంది. ఇక ఆమెను చూసిన వారు తనని ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు.

ఇక ఆ టైంలోనే అక్కడికి ఓ చిన్న పిల్లవాడు వచ్చి తనను తదేకంగా చూస్తూ ఉండగా ఆమె తన దగ్గరికి తీసుకోవాలని ట్రై చేసింది. బట్ వాడు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా కాసేపు ఈ బ్యూటీ రోడ్డు మీద వడాపావ్ తింటూ వారితో ముచ్చటించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ అవుతుండగా.. నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అంతా బానే ఉంది కానీ మరీ అంత బోల్డ్ షో చేయడం అవసరమా అని, నువ్వు సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story