పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా గ్లామర్ షోతో రెచ్చగొడుతున్న హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

by I. Sairam |

‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత(Praneetha) మనందరికీ సుపరిచితమే.

పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా గ్లామర్ షోతో రెచ్చగొడుతున్న హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత(Praneetha) మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయినా హీరోయిన్‌గా అనుకున్నంత గుర్తింపు అయితే తెచ్చుకోలేకపోయింది. దీంతో సినిమాల్లో సెకెండ్ హీరోయిన్‌గా నటించసాగింది. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాతో ఆమెకు మంచి ఫేమ్ వచ్చింది.

ఆ తర్వాత ‘పాండవులు పాండవులు తుమ్మెద’(Pandavulu Pandavulu tummeda), ‘రభస’(Rabhasa), ‘డైనమైట్’(Dynamite), ‘హలో గురు ప్రేమ కోసమే’(Hello Guru Prema Kosame) తదితర సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. గతంలో ఆమెకు ఓ పాప పుట్టగా.. ఇటీవలే బాబు జన్మించాడు. ఇక వారి ఫొటోలను సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ వైరల్ అవుతోంది. తాజాగా ప్రణీత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో పెసరపప్పు కలర్ డ్రెస్ వేసుకుని ఐస్‌కు కాటుకతో పాటు ఐలాష్ పెట్టుకుంది. ఇక చిన్న క్లిప్ పెట్టి హెయిర్ లీవ్ చేసి ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా అదే ఫిజిక్కును మైంటైన్ చేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. గార్జియస్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story