ఆ హీరోయిన్ బాగా కోపరేట్ చేసింది.. హీరో శివాజి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2026-02-08 05:23:36  IST  )

90s వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో దూసుకు పోతున్న హీరో శివాజీ (Sivaji) ప్రస్తుతం ఆయ‌నే స్వ‌యంగా నిర్మాత మారి త‌న శ్రీ శివాజీ ప్రొడక్షన్స్(Sri Shivaji Productions) పతాకంపై ‘సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని’ సినిమా చేస్తున్నాడు.

ఆ హీరోయిన్ బాగా కోపరేట్ చేసింది.. హీరో శివాజి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: 90s వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో దూసుకు పోతున్న హీరో శివాజీ (Sivaji) ప్రస్తుతం ఆయ‌నే స్వ‌యంగా నిర్మాత మారి త‌న శ్రీ శివాజీ ప్రొడక్షన్స్(Sri Shivaji Productions) పతాకంపై ‘సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని’ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మూవీలో ల‌య (Laya) శివాజీకి జంట‌గా న‌టిస్తోండ‌గా ప్రిన్స్‌(Prinse), అలీ(ali), ధ‌న్‌రాజ్‌(Dhanraj), ఇమ్మాన్యూయేల్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

సుధీర్ శ్రీరామ్(Sudheer Sreeram) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా రంజిన్ రాజ్(Ranjin Raj) సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రం ఈ నెల 12న ఈటీవీ విన్‌(ETV Win)లో స్ట్రీమింగ్‌ కానున్నది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు. అయితే ఈ ఈవెంట్‌లో శివాజీ హీరోయిన్ లయ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఆయన మాట్లాడుతూ.. ‘హీరోయిన్ లయ గురించి ఎంత చెప్పినా తక్కువే. 6:30కి షాట్ తీయాలంటే తను ఎర్లీ మార్నింగ్ 3:30కే లొకేషన్‌కు వచ్చింది. తను షూటింగ్ చేసినన్ని రోజులు ప్రతి సందర్భాన్ని చెప్పుకోవచ్చు. అంత బ్రహ్మాండంగా కోపరేట్ చేసి ఎలా గైనా సరే ఒక మంచి హిట్ సినిమా అవ్వాలని తను చాలా కష్టపడింది. చాలా సపోర్ట్ చేసింది. ఇంత చేసిన నేను లయకు థ్యాంక్యూ తప్పా ఏమీ చెప్పుకోలేను.. థ్యాంక్యూ లయ థ్యాంక్యూ సో మచ్’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

పవన్ కల్యాణ్ సినిమాతో కమ్‌బ్యాక్ ఇవ్వనున్న హీరోయిన్.. ఆనందంలో ఫ్యాన్స్

Next Story