బాలయ్యా బాబుతో కలిసి బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్న హీరోయిన్.. పోస్ట్ వైరల్

by Gugulothu.Kavitha |

వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బాలయ్యా బాబుతో కలిసి బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్న హీరోయిన్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఈ భామ బాలకృష్ణ(Balakrishna) సరసన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలో నటించింది. బాబి కొల్లి(Bobby Kolli) దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన పుట్టిన రోజు(Bithday) వేడుకలను డాకు మహారాజ్ టీమ్‌తో సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలను షేర్ చేస్తూ.. ‘ఇది నా లైఫ్‌లోనే బెస్ట్ బర్త్‌డే.. నాకు ఉత్తమ పుట్టినరోజు బహుమతిని అందించినందుకు అండ్ నా అత్యంత ప్రత్యేకమైన, గుర్తుండిపోయే & బ్లాక్‌బస్టర్ పుట్టినరోజుగా చేసినందుకు గానూ ప్రేక్షకులకు ధన్యవాదాలు. అలాగే డాకు మహారాజ్ పట్ల మీకున్న ప్రేమకు ధన్యవాదాలు.. మేము మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు ప్రగ్యాకి బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.

Next Story