- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగ్నంగా నటించేందుకు ఆ హీరోయిన్ అంగీకరించింది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా జర్మియా(Andrea Jeremiah ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింగర్‌గా పరిచయం అయి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా జర్మియా(Andrea Jeremiah ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింగర్‌గా పరిచయం అయి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన పాటలతో ఈ అమ్మడు ప్రేక్షకులను కట్టిపడేసింది. తన వాయిస్‌తో పాటు చూడటానికి కూడా బాగుంటడంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ‘యుగానికి ఒక్కడు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో వరుస అవకాశాలు రావడంతో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఓ వైపు సినిమాలు చేస్తూ మరో వైపు సింగర్‌గానూ కొనసాగుతోంది. గత ఏడాది ఈ అమ్మడు తెలుగులో వెంకటేష్(Venkatesh) ‘సైంధవ్’(Saindhav) సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.
తన నటనతో అందరికీ మంత్రముగ్ధులను చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం తమిళంలో మిస్కిన్(Mysskin) దర్శకత్వంలో ‘పిసాసు-2’(Pisasu-2) లో చేసింది. అయితే ఈ మూవీ ‘పిసాసు’ సీక్వెల్‌గా రాబోతుంది. అయితే మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌ను ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినప్పటికీ విడుదల కాలేదు. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ‘పిసాసు-2’ షూటింగ్ 2022లోనే స్టార్ట్ అయినప్పటికీ మూడేళ్లు పూర్తి కావస్తున్నా థియేటర్స్‌లోకి రాలేదు.
అయితే ఈ చిత్రం మార్చిలో విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ మిస్కిన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘పిసాసు-2(Pisasu-2) కథ విన్నాక కొన్ని సీన్స్ నగ్నంగా నటించేందుకు ఆండ్రియా అంగీకరించింది. కథకు అవసరం అని ఆమె ఆ రిస్క్ చేయడానికి కూడా రెడీ అయింది. దీనికి సంబంధించిన ఒక ఫొటో షూట్(Photo shoot) కూడా చేయాలని ఆమె సిద్ధపడింది. కానీ నగ్నంగా సీన్స్ చేస్తే యువత మరో కోణంలో చూస్తారేమో అనిపించింది. అందుకే ఆండ్రియాను అలా చూపించే విషయంలో వెనకడుగు వేశాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది. ఆండ్రియాతో నిజంగా నగ్న సన్నివేశాలు తీస్తే సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యేది. మంచి బిజినెస్ జరిగేది కావచ్చు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మిస్కిన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






