హ్యాపీ బర్త్‌డే మైన్ అంటూ ఆమెకు విష్ చేసిన హీరో.. సో స్వీట్ అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్(Allari Naresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

హ్యాపీ బర్త్‌డే మైన్ అంటూ ఆమెకు విష్ చేసిన హీరో.. సో స్వీట్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్(Allari Naresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన కామెడీ సినిమాలతో ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలంకరిస్తూనే ఉన్నాడు. అలా రవిబాబు డైరెక్షన్లో ‘అల్లరి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నరేష్.. ఆ చిత్రం హిట్ అవ్వడంతో.. ‘అల్లరి’ ని ఇంటి పేరుగా చేసేసుకుని అల్లరి నరేష్ అయ్యాడు. అతి తక్కువ సమయంలోనే తానేంటో ప్రూవ్ చేసుకుని చిన్న నిర్మాతలకు వరంగా పెద్ద దిక్కుగా మారాడు. 1982 జూన్ 30 న జన్మించిన ‘అల్లరి’ నరేష్ చెన్నైలో చదువుకున్నాడు.

అప్పట్లో సినీ పరిశ్రమ చెన్నైలోనే ఉండుట వలన నరేష్ తల్లిదండ్రులు కూడా చెన్నె లోనే ఉండేవారు. ఇక 2015 మే 29 న హైదరాబాద్‌లో నరేష్ పెళ్లి జరిగింది. అయితే నరేష్ పెళ్లి చేసుకున్న విరూప కూడా చెన్నై‌కి చెందిన అమ్మాయే. నిజానికి ఆమె విజయవాడకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆమె తల్లిదండ్రులు ఉద్యోగాల రీత్యా చెన్నైలో సెటిల్ అయ్యారు.

ఇదిలా ఉంటే.. చాలా రేర్‌గా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అల్లరి నరేష్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో తన భార్య బర్త్‌డే సెలబ్రేషన్స్ చేస్తున్న ఫొటోలను షేర్ చేస్తూ.. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు మైన్.. మనకోసం ఒక మైలురాయి మే ప్రారంభమవుతుంది’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సో స్వీట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story