- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యకు విడాకులు ఇచ్చి యంగ్ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్న హీరో.. అసలు విషయం చెప్పేశాడుగా!
కోలీవుడ్ యంగ్ హీరో జీవీ ప్రకాష్(G.V. Prakash) వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో జీవీ ప్రకాష్(G.V. Prakash) వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు సంగీత దర్శకుడిగా కొనసాగుతూనే మరోవైపు హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం జీవీ ప్రకాష్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌స్టోన్’(Kingston). ఇందులో దివ్య భారతి హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ ఫ్యాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ మార్చి 7న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఇక జీవీ ప్రకాష్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఇటీవల ఆయన తన భార్యతో విడిపోయిన విషయం తెలిసిందే. మనస్పర్థలు రావడం భార్య సైంధవికి విడాకులు ఇచ్చినట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశాడు. దీంతో కొద్ది కాలంపాటు వీరి విడాకులు సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా, జీవీ ప్రకాష్’కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన గత కొద్ది రోజుల నుంచి దివ్యతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ‘‘మేము డేటింగ్ చేయడం లేదు. కేవలం మంచి స్నేహితులం మాత్రమే. నేను ఆమెను సెట్స్‌లో మాత్రమే కలిశాను. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇస్తున్న సమయంలో ఇలా కలిశాం. కనీసం ఆమెను బయట కూడా కలవలేదు.మేమిద్దరం కలిసి నటించిన ‘బ్యాచిలర్’ సూపర్ హిట్ అయింది. అందులో మా ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది అందుకే అంతా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు కావచ్చు. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదు. మాకు అసలు ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేదు’’ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






