- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో' OTTలోకి వచ్చేస్తోంది..స్ట్రీమింగ్ ఎప్పుడంటే
టాలీవుడ్ కుర్ర హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన తాజా మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ కుర్ర హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన తాజా మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ( The Great Pre-Wedding Show). ఈ సినిమాకు సందీప్ అగరం, అస్మితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించగా కల్పనా రావు సహనిర్మాతగా ఉన్నారు. రాహుల్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రోహన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఇక ఈ నెల 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో పెళ్లి, ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఫోటోగ్రాఫర్ పడే కష్టాలు చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ మూవీలో కామెడీ మాత్రం బాగా పండింది. ఈ నేపథ్యంలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా Zee 5 ఓటీటీలో డిసెంబర్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు కీలక ప్రకటన వచ్చింది. దీంతో థియేటర్ లో మిస్సయిన వాళ్లు ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.






