- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tharun Bhascker: నటుడి కంటే దర్శకుడిగా వచ్చే మజా వేరు.. అదే కారణం
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ... నాకు నటన కంటే దర్శకత్వం అంటేనే ఇష్టం. నటించే టైంలో మనకు ఎవరి కంట్రోల్ ఉండదు, అదే దర్శకత్వం చేసే సమయంలో అందరినీ మనం కంట్రోల్ చేయవచ్చు, అందుకే దర్శకత్వం అంటే ఇష్టం అని ఈయన చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా, నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో తరుణ్ భాస్కర్ ఒకరు. ఈయన సినీ పరిశ్రమలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లి చూపులు చిత్రంతో దర్శకుడిగా కెరీర్ను మొదలుపెట్టాడు. ఈ మూవీ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలను పొంది అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ కి చాలా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈ దర్శకుడు రూపొందించిన ఈ నగరానికి ఏమైంది, కీడా కోలా చిత్రాలు కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాయి.
ఈ నగరానికి ఏమైంది చిత్రం తర్వాత ఈ నటుడు దర్శకత్వంపై కంటే కూడా నటనపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికి చాలా సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ 'గాయపడిన సింహం'లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఫిబ్రవరి 9న దీన్ని విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా తరుణ్ చాలామందితో ముచ్చటించాడు.
అందులో భాగంగా ఈయనకు మీరు ఒకవైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు, మరోవైపు నటిస్తున్నారు, ఈ రెండింటిలో మీకు ఏది అంటే చాలా ఇష్టం అనే ప్రశ్న ఎదురయింది. దీనికి తరుణ్ భాస్కర్... నాకు నటన కంటే దర్శకత్వం అంటే చాలా ఇష్టం. అందుకు కారణం... నటించే సమయంలో మనకు ఎవరి కంట్రోల్ ఉండదు, అదే దర్శకత్వం చేసే సమయంలో అందరినీ మనం కంట్రోల్ చేయవచ్చు, అలాగే మరికొన్ని విషయాలలో కూడా నటన కంటే దర్శకత్వం చాలా బెటర్ అని తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు.






