ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. తొలి మహిళా సింగర్ కన్నుమూత

by Gantepaka Srikanth |

తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొలి మహిళా సింగర్ బాలసరస్వతి (97) కన్నుమూశారు.

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. తొలి మహిళా సింగర్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొలి మహిళా సింగర్ బాలసరస్వతి (97) కన్నుమూశారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాలసరస్వతీదేవి(Bala Saraswathi) ప్రసిద్ధి పొందారు. ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం తెలుగువారికి సుపరిచితం. సినిమాలలో నేపథ్య గాయనిగానూ ఆమె ప్రసిద్ధి పొండారు. 1928లో జన్మించిన బాలసరస్వతి తన ఆరేళ్ల వయసు నుంచే పాడటం ప్రారంభించారు. ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు వారికి పరిచయమయ్యారు. ‘సతీ అనసూయ’ చిత్రంలో తొలి పాటను ఆలపించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో 2000కు పైగా పాటలు పాడారు.

Next Story