- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘విశ్వంభర’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’(Viswambhara).

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’(Viswambhara). వశిష్ఠ మల్లిడి(Mallidi Vasishta) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం సోసియో-ఫాంటసీగా తెరకెక్కుతుంది. ఇక దీనిని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి. వంశీ కృష్ణా రెడ్డి(Vamsi Krishna Reddy), ప్రమోద్ ఉప్పలపాటి(Pramod Uppalapati), విక్రమ్ రెడ్డి(Vikram Reddy) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీలో చిరంజీవి సరసన స్టార్ బ్యూటీ త్రిష, యంగ్ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath)లు కీలక పాత్రలో నటిస్తున్నారు.
అయితే షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఊహించని విధంగా రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక ఈ చిత్రం భారీ అంచనాల నడుమ మే 9న థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. అయితే గురువారం డైరెక్టర్ వశిష్ఠ ‘విశ్వంభర’ నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. జై శ్రీరామ్ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ పాట రామ రామ రఘురామ అంటూ సాగుతూ డివోషనల్‌గా అనిపించింది. ప్రస్తుతం ఈ లిరిక్స్ నెట్టింట ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కాగా ఫుల్ లిరికల్ సాంగ్ రేపు రిలీజ్ కాబోతుంది.






