RC16: ఆ వార్తల్లో నిజం లేదు.. ‘RC16’పై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం

by Chukka Sudharani |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రీసెంట్‌గా ‘గేమ్ చేంజర్’ (Game changer) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

RC16: ఆ వార్తల్లో నిజం లేదు.. ‘RC16’పై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రీసెంట్‌గా ‘గేమ్ చేంజర్’ (Game changer) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ అనంతరం ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఉప్పెన’ ఫేం డైరెక్టర్ బుచ్చిబాబు సానా (BuchiBabu Sana)తో జతకట్టాడు. ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయింది. అంతే కాకుండా మైసూర్‌ (Mysore)లో రామ్ చ‌ర‌ణ్‌పై కీల‌క‌మైన స‌న్నివేశాలు కూడా చిత్రీకరించారు మేక‌ర్స్. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా గురించి నెట్టింట పలు రూమర్స్ (Rumors) వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

RC16కు మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్న ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని, ఆయన ప్లేస్‌లోకి దేవిశ్రీ ప్రసాద్‌ (Devishri Prasad)ను తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్‌గా వైరల్ అవుతోంది. తాజాగా దీనిపై చిత్ర బృందం స్పందించింది. ‘వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఇలాంటి రూమర్స్ నమ్మెద్దు, షేర్ చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని తెలుపుతూ.. ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కానుందని చెప్పుకొచ్చారు. కాగా.. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్టార్ నటుడు ‘మీర్జాపూర్‌’ వెబ్ సిరీస్‌లో మున్నాభాయ్యగా న‌టించిన‌ దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Next Story