- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజం మాట్లాడితే సినిమా ఆగిపోతుందనే భయం.. ఇండస్ట్రీలో పరిస్థితులపై సోనాక్షి సిన్హా షాకింగ్ రియాక్షన్!
యేటర్స్‌గా మనం చాలా క్లిష్టమైన సమయాల్లో ఉన్నాం. గతంలో ఉన్నంత స్వేచ్ఛ ఇప్పుడు మాకు లేదు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, కోలీవుడ్ స్టార్ జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘సిస్టమ్’. ఒక పవర్‌ఫుల్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, అధికారానికి , న్యాయానికి మధ్య జరిగే పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను, మనుషుల స్వార్థ ప్రయోజనాలను ప్రశ్నించేలా ఈ చిత్రాన్ని దర్శకురాలు అశ్విని అయ్యార్ తివారి అద్భుతంగా రూపొందించారు. ఈ సినిమా మే 22న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా సోనాక్షి సిన్హా నేటి సినిమాల పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నేటి కాలంలో ఒక కథను నిజాయితీగా చెప్పడం చాలా కష్టమైపోతోందని సోనాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. "క్రియేటర్స్‌గా మనం చాలా క్లిష్టమైన సమయాల్లో ఉన్నాం.
గతంలో ఉన్నంత స్వేచ్ఛ ఇప్పుడు మాకు లేదు. ఈ రోజుల్లో ఏదైనా విషయంలో మరీ ఎక్కువగా నిజం మాట్లాడితే, ఆ సినిమానే ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి" అని ఆమె అన్నారు. సమాజంలోని యథార్థమైన నిజాలను తెరపైకి తీసుకురావాలంటే భయపడాల్సిన వాతావరణం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల కథలను ఎంచుకునేటప్పుడు మేకర్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సోనాక్షి తెలిపారు. "సంపూర్ణమైన నిజాన్ని మాట్లాడటం ఇప్పుడు కష్టంగా మారింది. అందుకే ప్రజలు వివాదాలకు దూరంగా ఉండే ఇతివృత్తాలనే ఎంచుకుంటున్నారు" అని ఆమె చెప్పారు. తన సినిమా ‘సిస్టమ్’ కూడా వ్యవస్థలోని లోసుగులను ప్రశ్నించేదే అయినప్పటికీ, ఇలాంటి కథలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సవాల్‌తో కూడుకున్న పని అని ఆమె స్పష్టం చేశారు.
వయసు పెరగడం రాత్రికి రాత్రే జరగదు.. బాడీ షేమింగ్‌పై టబు సంచలన వ్యాఖ్యలు!






