- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొప్ప మనసు చాటుకున్న ప్రముఖ హీరోయిన్.. ఆమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
బాలీవుడ్(Bollywood), టాలీవుడ్ ఇండస్ట్రీ(Tollywood Industry)లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) గురించి సుపరిచితమే.

దిశ,వెబ్‌డెస్క్: బాలీవుడ్(Bollywood), టాలీవుడ్ ఇండస్ట్రీ(Tollywood Industry)లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) గురించి సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఊర్వశి రౌతేలా ఈ ఏడాది ‘డాకు మహారాజ్’ మూవీ(Daku Maharaj)తో అభిమానులను అలరించింది. బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన ఈ మూవీలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఆ మూవీలో దబిడి దిబిడి సాంగ్‌లో నటుడు బాలయ్యతో చిందులేసి అభిమానుల మనుసులు దోచుకుంది. అయితే.. ఇటీవల ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు(Birthday)ను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.
ఈ క్రమంలో బర్త్ డే సందర్భంగా ఊర్వశి రౌతేలా గొప్ప మనస్సు చాటుకుంది. తాజాగా తన పుట్టినరోజు, శివరాత్రి సందర్భంగా ఆమె ఫౌండేషన్ తరపున అనాథలైన అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించింది. మొత్తం 251 జంటలకు సామూహిక వివాహాలు జరిపించడం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని బాగేశ్వర్ ధామ్ టెంపుల్‌లో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరైనట్లు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ దాదాపు 251 జంటలకు వివాహం జరిపించడమే కాకుండా స్వయంగా తానే భోజనం వడ్డించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఊర్వశి రౌతేలా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో నెట్టింట ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ కావడంతో.. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బ్యూటీ విత్ గోల్డెన్ హార్ట్ అని కొనియాడుతున్నారు.






