- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ది రన్ టైంపై మొదలైన కసరత్తు.. ఫైనల్ టార్గెట్ అదే
‘పెద్ది’ చిత్రం మూడు గంటల ఒకటి లేదా రెండు నిమిషాల రన్‌టైమ్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘పెద్ది’ సినిమా మూడు గంటలకు మించిన రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నిజంగానే మూడు గంటలకు పైగా నిడివితోనే సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఇంత భారీ రన్‌టైమ్ ఉండటంతో, ఎక్కడైనా కథ నెమ్మదిగా అనిపిస్తే నెగటివ్ టాక్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న చిత్ర బృందం ప్రస్తుతం దాన్ని దృష్టిలో పెట్టుకుని కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ప్రేక్షకులకు ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా ఉండేలా కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేసి, రన్‌టైమ్‌ను సుమారు మూడు గంటల ఒకటి లేదా రెండు నిమిషాలకి ఫైనల్ చేయాలని బుచ్చిబాబు సనా టీం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ‘పెద్ది’ సినిమా అన్ని భాషల డైలాగ్‌ల సెన్సార్ ప్రక్రియ కూడా పూర్తైనట్లు సమాచారం. ఇలా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సినిమాను జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు.






