ముచ్చటగా మూడోసారి రొమాన్స్ చేయనున్న జంట..‘VD-14’ మూవీలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఫిక్స్!

by Mallepaka Hamsa |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్(Rahul Sankrityan) కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.

ముచ్చటగా మూడోసారి రొమాన్స్ చేయనున్న జంట..‘VD-14’ మూవీలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఫిక్స్!
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్(Rahul Sankrityan) కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ‘VD-14’ వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్(Ravi Shankar) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఒక వీరుడి పోరాటాన్ని చూపిస్తూ 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘టాక్సావాలా’ సూపర్ హిట్‌గా నిలవడంతో ‘VD-14’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక గత ఏడాది మే నెలలో ఈ మూవీని అఫిషియల్‌గా ప్రకటించారు.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. వచ్చే నెలలో రాయలసీమలో విజయ్ పలు సీన్స్ చేయనున్నారట. ఈక్రమంలో.. తాజాగా, ‘VD-14’ చిత్రంలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు పలు పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తున్నట్లు సమాచారం. ఆమెకు కథ వినిపించగా.. నటించేందుకు ఒప్పుకున్నట్లు టాక్. కాగా, వీరిద్దరి కాంబోలో వచ్చిన మొదటి సినిమానే హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత నటించిన ‘డియర్ కామ్రేడ్’ వచ్చి ఆరేళ్లు అవుతోంది. ఇక ఇప్పుడు మరోసారి విజయ్, రష్మిక ముచ్చటగా మూడోసారి రొమాన్స్ చేయబోతుండటంలో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

Next Story