ఆ సంస్థ చేతికి శ్రీ విష్ణు 'మృత్యుంజయ్' ఓవర్సీస్ హక్కులు

by Pulgam srinivas |

శ్రీ విష్ణు హీరోగా నటించిన మృత్యుంజయ్ మూవీ ఓవర్సీస్ హక్కులను శ్లోక, వైబ్రాంట్ సంస్థలు దక్కించుకున్నాయి.

ఆ సంస్థ చేతికి శ్రీ విష్ణు మృత్యుంజయ్ ఓవర్సీస్ హక్కులు
X

దిశ, వెబ్ డిస్క్ : టాలెంటెడ్ నటుడు శ్రీ విష్ణు తాజాగా మృత్యుంజయ్ అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఈ సినిమాను మొదట ఫిబ్రవరి 27వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రచారాలు కూడా చేశారు. కానీ ఈ తేదీ తర్వాత కేవలం ఒకరోజు గ్యాప్‌లో ఫిబ్రవరి 28వ తేదీన శ్రీ విష్ణు హీరోగా రూపొందిన విష్ణు విన్యాసం కూడా విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడతాయని చాలామంది అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో మృత్యుంజయ్ యూనిట్ వెనక్కు తగ్గింది. ఈ సినిమా విడుదల తేదీని మార్చింది.

ఫిబ్రవరి 27 నుండి మార్చి 6వ తేదీకి ఈ సినిమా విడుదల తేదీ మారింది. ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను విక్రయిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులను కూడా అమ్మేశారు. వాటిని శ్లోక, వైబ్రాంట్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని ఈ రెండు సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. ఈ చిత్రంలో శ్రీ విష్ణుకి జోడీగా రెబా మోనికా జాన్ నటించింది. హుస్సేన్ షా కిరణ్ ఈ మూవీకి రచన, దర్శకత్వం వహిస్తుండగా, సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు.




Next Story