అమెజాన్ నుంచి ఆ సంస్థ చేతికి వచ్చిన ‘జననాయగన్’ ఓటీటీ హక్కులు

by Pulgam srinivas |

జననాయగన్ ఓటీటీ హక్కులను రూ.50 కోట్ల ధరకు జీ5 సంస్థ దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అమెజాన్ నుంచి ఆ సంస్థ చేతికి వచ్చిన ‘జననాయగన్’ ఓటీటీ హక్కులు
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ నటుడు తలపతి విజయ్ తాజాగా “జననాయగన్” చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటించగా, మమితా బైజు కీలక పాత్రలో కనిపించింది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. అందుకు అనుగుణంగా చిత్రానికి సంబంధించిన చాలా పనులు కూడా పూర్తయ్యాయి. అయితే చివరి నిమిషంలో సినిమా విడుదల వాయిదా పడింది. సంక్రాంతి పండుగ ముగిసి ఇప్పటికే చాలా రోజులు గడిచినా ఈ సినిమా కొత్త విడుదల తేదీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్‌కు సంబంధించిన వార్తలు కోలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నప్పటికీ ఇప్పుడు ఆ సంస్థ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఆ స్థానంలో జీ5 సంస్థ ఈ మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. జీ5 సంస్థ ఈ సినిమాకు సుమారు రూ.50 కోట్ల ఆఫర్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మూవీ మేకర్స్ మరియు జీ5 మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, ఒప్పందం ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది.

Next Story