గద్దర్ అవార్డుల్లో కమిటీ కుర్రోళ్ల సత్తా.. వైరల్ అవుతున్న మెగా డాటర్ రియాక్షన్

by Gugulothu.Kavitha |

14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం నిన్న రాష్ట్ర అవార్డుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

గద్దర్ అవార్డుల్లో కమిటీ కుర్రోళ్ల సత్తా.. వైరల్ అవుతున్న మెగా డాటర్ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం నిన్న రాష్ట్ర అవార్డుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. గద్దర్ పేరిట ఇవ్వనున్న ఈ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం నిన్న ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులను కమిటీ కుర్రోళ్లు మూవీ గెల్చుకుంది. ఇక ఈ మూవీకు జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. అంతే కాకుండా దర్శకుడు యదు వంశీ ఉత్తమ తొలి దర్శకుడి అవార్డును కూడా అందుకున్నారు.

అయితే తన చిత్రం రెండు రాష్ట్ర అవార్డుల్ని సాధించడంతో నిహారిక కొణిదెల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు మెగా డాటర్ మాట్లాడుతూ .. ‘మా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో రెండు అవార్డులను గెలుచుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా సినిమాను గుర్తించినందుకు గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు, మొత్తం జ్యూరీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

అలాగే మిగతా విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు’ అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా యదు వంశీ డైరెక్షన్‌లో నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా ఆగస్టు 9, 2024న విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. థియేటర్, ఓటీటీ ఇలా అన్ని చోట్లా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.

Next Story