- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sreeleela: అతడితో కలిసి ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లిన శ్రీలీల.. కారణం అదేనా?
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల (sreeleela) ‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో వచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ సంపాదించుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల (sreeleela) ‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో వచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ సంపాదించుకుంది. ఇక వరుస ఆఫర్లు అందుకుంటూ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. కానీ వరుసగా నాలుగు సినిమాలు ఫ్లాప్ కావడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో కొద్ది రోజుల పాటు శ్రీలీల ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇక గత ఏడాది వచ్చిన ‘పుష్ప-2’ (pushpa-2) మూవీతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో కిస్సిక్ సాంగ్‌లో స్టెప్పులేసిన ఈ భామ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది. ఈ సినిమా తర్వాత ఆమె ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇటీవల ‘రాబిన్‌హుడ్’ (Robinhood)చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.
కానీ హిట్ సాధించలేకపోయింది. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh), తమిళంలో పరాశక్తి(Parashakti), కన్నడలో జూనియర్,దుబారి వంటి మూవీస్ చేస్తోంది. ఇక ‘అషికి-3’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) హీరోగా నటిస్తున్నాడు. దీనికి అనురాగ్ బసు(Anurag Basu) దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రం అక్టోబర్ నెలలో విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సిక్కీంలో జరుగుతోంది. తాజాగా, మూవీ టీమ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు. దీంతో శ్రీలీ, అనురాగ్, కార్తీన్ ఆర్యన్‌లకు సీఎం రాష్ట్ర సంప్రదాయం ప్రతిబింబించేలా ప్రత్యేక బహుమతులు అందజేశారు. అంతేకాకుండా పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మూవీ టీమ్ కూడా సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు.
It was a pleasure to meet Bollywood filmmaker Shri Anurag Basu and renowned actors Mr Kartik Aaryan and Ms. Sreeleela at my official residence, Mintokgang.
— Prem Singh Tamang (Golay) (@PSTamangGolay) April 2, 2025
They have been in the state for a week, shooting their upcoming film at iconic locations such as MG Marg and Tsomgo Lake.… pic.twitter.com/ycwHB8R7IG






