- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రూరమైన వేట ప్రారంభం.. వైల్డ్ పోస్టర్‌తో బిగ్ అప్డేట్ ఇచ్చిన టాలీవుడ్ హీరో
కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj) ఇప్పుడు తన కొత్త సినిమాతో పవర్‌ఫుల్ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj) ఇప్పుడు తన కొత్త సినిమాతో పవర్‌ఫుల్ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డేవిడ్ రెడ్డి’(Devid Reddy). ఈ సినిమాకు హనుమ రెడ్డి యక్కంటి(Hanuma Reddy Yakkanti) దర్శకత్వం వహిస్తుండగా, వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మొటుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ ఏర్పడగా, తాజాగా మనోజ్ చేసిన ప్రకటన అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. జనవరి 26, 2026 న రిపబ్లిక్ డే సందర్భంగా ‘డేవిడ్ రెడ్డి’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు మనోజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈమేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘క్రూరమైన యుగం రేపు ఉదయం 11:11 గంటలకు ప్రారంభమవుతుంది.
"రూత్‌లెస్" ఉదయం 11:11 గంటలకు, "బ్రూటల్" సాయంత్రం 4:44 గంటలకు స్టార్ట్ కాబోతుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో ముళ్లతీగలతో ఉన్న కర్రపై మొత్తం రక్తం చిందుతూ వైల్డ్‌గా కనిపించింది. కాగా ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా, ఈసారి మరింత రా అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్న ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
READ MORE ....






