- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాక్సాఫీసు షేక్ అవడం ఖాయం.. పూరి జగన్నాథ్-విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ నుంచి సెన్సేషనల్ అప్డేట్!
ఒక క్రేజీ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ పంచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ (RR) పనులు చాలా వేగంగా జరుగుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దిశ, సినిమా: టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’. పూరి జగన్నాథ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్, విజయ్ సేతుపతి పవర్‌ఫుల్ యాక్టింగ్ తో రాబోతున్న ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో మాలీవుడ్ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటి టబు, కన్నడ నటుడు దునియా విజయ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్, విష్ణు రెడ్డి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై చార్మీ కౌర్, పూరి జగన్నాథ్, జెబి నారాయణరావు కొండోళ్ల కలిసి ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ పంచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ (RR) పనులు చాలా వేగంగా జరుగుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అవుట్‌పుట్ చాలా అద్భుతంగా వస్తోందని, త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు పూరి, రామీ మ్యూజిక్ కలయికలో ఒక సంచలనాత్మక సంగీత అనుభూతిని అందించబోతున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఇప్పటికే సిద్ధమైన ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయని నమ్మకంగా చెబుతున్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు బాక్సాఫీసు షేక్ అవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. అలాగే విజయ్ సేతుపతిని పూరి జగన్నాథ్ తన స్టైల్‌లో ఎలా చూపించబోతున్నారనే క్యూరియాసిటీ పెరిగిపోయింది.






