బిగ్‌బాస్ ఓటీటీ 'లోగో' విడుదల చేసిన నిర్వాహకులు

by Web Desk |
బిగ్‌బాస్ ఓటీటీ లోగో విడుదల చేసిన నిర్వాహకులు
X

దిశ, సినిమా: రియాలిటీ షో 'బిగ్‌బాస్' తెలుగులో విజయవంతంగా 5 సీజన్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ప్రేక్షకులు బిగ్ బాస్ తదుపరి సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కోసం షో నిర్వాహకులు తాజాగా బిగ్ అప్‌డేట్ (సర్‌ప్రైజ్) ఇచ్చారు. సీజన్ 5 గ్రాండ్ ఫినాలే వేదికగా నెక్ట్స్ సీజన్ 2నెలల్లోనే స్టార్ట్ చేస్తామని నాగార్జున ప్రకటించగా.. అన్నట్లుగానే మాటనిలబెట్టుకున్న మేకర్స్ ఓటీటీ‌లో రాబోతున్న ఈ సీజన్ డిస్నీ+హాట్‌స్టార్ లోగోను విడుదల చేశారు.

ఈ మేరకు '2022లో అతిపెద్ద సర్‌ప్రైజ్ సిద్ధమైంది. బిగ్‌ బాస్ నాన్‌స్టాప్ 24/7 వినోదాన్ని అందించబోతుంది. త్వరలో ఈ అద్భుతం మీ ముందుకు రానుంది' అంటూ సోషల్ మీడియాలో లోగోను షేర్ చేశారు. ఇక ఫిబ్రవరి 26 నుంచి బిగ్‌బాస్ ఓటీటీ వెర్షన్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుండగా.. తెలుగులో మొదటిసారి ఓటీటీలో రాబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్‌ల జాబితా దాదాపుగా ఫైనల్ అయినట్లు సమాచారం.

https://twitter.com/DisneyPlusHSTel/status/1491389161622077442?s=20&t=6NawxuBNHf65H6rOAhalEg

Next Story