సైఫ్‌కు సాయం చేసిన ఆటో డ్రైవర్‌.. భారీగా రివార్డు ప్రకటించిన సింగర్!

by Jakkula.Mamatha |

బాలీవుడ్ స్టార్ హీరో(Bollywood star hero) సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) పై ఓ దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.

సైఫ్‌కు సాయం చేసిన ఆటో డ్రైవర్‌.. భారీగా రివార్డు ప్రకటించిన సింగర్!
X

దిశ,వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో(Bollywood star hero) సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) పై ఓ దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇక చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న సైఫ్ ప్రజెంట్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఈ దాడి సమయంలో సైఫ్‌ను ఓ ఆటో డ్రైవర్(Auto Driver) ఆసుపత్రికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నటుడికి సాయం చేసిన ఆ ఆటో డ్రైవర్‌ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన సాయాన్ని ప్రముఖ పంజాబీ సింగర్ మికా సింగ్‌ (Mika Singh) అభినందించారు.

ఈ మేరకు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాకు భారీ రివార్డు (Reward) ప్రకటించారు. ‘‘ఎంతో మందికి ఇష్టమైన సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ ను కాపాడినందుకు భజన్ సింగ్ భారీ రివార్డుకు అర్హుడని నేను నమ్ముతున్నా. అతడు సకాలంలో స్పందించడం అభినందనీయం. ఎవరికైనా అతడి పూర్తి వివరాలు తెలిస్తే నాకు చెప్పండి. అతడికి రూ.1 లక్ష బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా’’ అని సింగర్ మికా సింగ్(Mika Singh) ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. బుధవారం సైఫ్‌ అలీ ఖాన్‌ సైతం ఆటో డ్రైవర్‌ను కలిశారు. సకాలంలో తనను ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు సైఫ్‌ దంపతులు అతడికి కొంత నగదు కూడా రివార్డుగా ఇచ్చినట్లు తెలిసింది.

Next Story