- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యూస్.. లైక్స్‌తో అదరగొట్టిన ఆరా ఆఫ్ ఉస్తాద్.. అల్లు అర్జున్ రికార్డును లేపేసింది.
ఉస్తాద్ భగత్ సింగ్'లోని ఆరా ఆఫ్ ఉస్తాద్ పాటకి 24 గంటల్లో 11.44 మిలియన్ వ్యూస్ రాగా, పుష్ప మూవీలోని సూసైకి సాంగ్ కి 10.94 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. మార్చి 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలోని ఆరా ఆఫ్ ఉస్తాద్ అంటూ సాగే లిరికల్ వీడియోను విడుదల చేసింది. ఈ సాంగ్ విడుదలకు ముందు ఈ మూవీ యూనిట్ ఈ సాంగ్ గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అలాగే ఈ పాట విడుదల కోసం ఓ పెద్ద ఈవెంట్ను కూడా నిర్వహించారు.
దానితో పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా ఈ సాంగ్ పై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సాంగ్ రిలీజ్ అయిన 24 గంటల్లో 11.44 మిలియన్ వ్యూస్, 138k లైక్స్ ను సాధించింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ సాంగ్కు మంచి రెస్పాన్స్ లభించినా భారీ స్థాయిలో రికార్డులను మాత్రం నెలకొల్పలేకపోయింది. కానీ పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప పార్ట్ 2 మూవీకి సంబంధించిన సూసైకి సాంగ్ రికార్డును మాత్రం క్రాస్ చేసింది. సూసైకి పాటకి 24 గంటల్లో 10.97 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలా ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ పుష్పలోని సూసేకి సాంగ్ను దాటేసింది.






