అలాంటి ఫొటో షూట్ చేసిన యాంకర్.. పెళ్లి అయ్యాక కూడా ఇలాంటివి అవసరం అంటారా అధ్యక్షా అంటూ మీమ్స్

by Kavitha |   ( Updated:2025-03-27 03:46:53.0  )
అలాంటి ఫొటో షూట్ చేసిన యాంకర్.. పెళ్లి అయ్యాక కూడా ఇలాంటివి అవసరం అంటారా అధ్యక్షా అంటూ మీమ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై తన యాంకరింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న యాంకర్ స్రవంతి చొక్కారపు(Sravanthi Chokkarapu) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ తన మాటలతో ఆడియన్స్‌ను మంత్ర ముగ్ధులను చేస్తోంది. కేవలం టీవీ షోలలోనే కాకుండా.. స్టార్ హీరోల ఈవెంట్లలో కూడా రచ్చ చేస్తుంది. తన అందంతోనే కాదు.. తన మాటలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. కేవలం ఆన్ స్క్రీన్ పైనే కాకుండా సోషల్ మీడియా(Social Media)లో కూడా రచ్చ చేస్తుంది. అలా పెళ్లయిన ఏమాత్రం తగ్గేదేలే అంటూ హాట్ ఫొటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తోంది.

దీంతో శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company)తో పాటు జబర్దస్త్(Jabardasth) షోలో యాంకరింగ్ చేసే అవకాశాన్ని అందుకుంది. ఇలా ఈ అమ్మడు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక స్రవంతి పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె భర్త పేరు ప్రశాంత్(Prashanth). ఆయన ఇండస్ట్రీలిస్ట్ . ఆయన కూడా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానులు. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఫ్యామిలి స్టార్’(Family Star) అనే ఎంటర్‌టైన్‌మెంట్ షోకు యాంకరింగ్ చేస్తుంది.

అయితే ఈ అమ్మడు ఆన్ స్క్రీన్‌లో ఎలా ఉంటుందో సోషల్ మీడియాలోనూ ఈ అందాల యాంకరమ్మ చేసే రచ్చ మామూలుగా ఉండదు. హీరోయిన్ లా తన అందాల ఆరబోతతో తన ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తోంది. ఈ క్రమంలో ఈ భామ తాజాగా ఓ హాట్ ఫొటో షూట్ చేసింది. అందులో టవల్‌లో బోల్డ్ ఫొటో షూట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. మీమ్స్ రాయుళ్లు.. పెళ్లి అయ్యాక కూడా ఇలాంటి ఫొటో షూట్ అవసరం అంటారా అధ్యక్షా.. అంటూ చిరంజీవి ఫొటో యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ మీమ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.

Read More..

Iswarya Menon : కసి చూపులతో సెగలు రేపుతున్న ఐశ్వర్య.




Next Story

Most Viewed