- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా రామునితో నేను అంటూ ఫొటోస్ షేర్ చేసిన నటి.. క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్
జబర్దస్త్ షో(Jabardasth Show)కి యాంకరింగ్ చేసి నేడు సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగిన యాంకర్ అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ షో(Jabardasth Show)కి యాంకరింగ్ చేసి నేడు సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగిన యాంకర్ అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన యాంకరింగ్‌తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘రంగస్థలం’(rangasthalam) సినిమాలో రంగమ్మత్తగా నటించే చాన్స్ లభించింది. ఆ మూవీతో ఈ అమ్మడు గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
అలా కొన్ని చిత్రాల్లో మెయిన్ లీడ్ కూడా పోషించింది. అలాగే మరోసారి సుకుమార్ దర్శకత్వంలో బన్నీ(Allu Arjun) హీరోగా వచ్చిన ‘పుష్ప’(Pushpa) మూవీలో సునీల్(Sunil) భార్య దాక్షాయణిగా నటించి మెప్పించింది. తన నటనతో అందరికీ షాక్‌కు గురిచేసింది. ఇక రీసెంట్‌గా ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప-2’(Pushpa-2)లో కూడా నటించి అలరించింది. అలా ఓ పక్కా సినిమాలతో బిజీ ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొజులతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా అనసూయ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో తన భర్తతో దిగిన అదిరిపోయే ఫొటోలను షేర్ చేస్తూ.. ‘నా రామునితో నేను.. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






