చీరలో చందమామలా మెరిసిపోతున్న నటి.. ఇలా పద్ధతిగా ఉండొచ్చు కదా అంటూ నెటిజన్ల కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-12-11 06:30:21  IST  )

టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

చీరలో చందమామలా మెరిసిపోతున్న నటి.. ఇలా పద్ధతిగా ఉండొచ్చు కదా అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ జబర్దస్త్(Jabardasth) కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. దీంతో ఈ చిన్నదానికి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘రంగస్థలం’(Rangasthalam) మూవీలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది. దీంతో అక్కడి నుంచి ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా ‘పుష్ప’(Pushpa), ‘పుష్ప-2’(Pushpa-2) వంటి భారీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఇటీవల వచ్చిన అరి వంటి సినిమాల్లో.. కూడా ఆమె నటన ప్రత్యేకంగా నిలిచింది. ఇదిలా ఉంటే.. అనసూయ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ.. తన అభిమానులతో తరచూ కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గామారింది. తాజాగా అనసూయ తన సోషల్ మీడియాలో చీరలో చందమామలా రెడీ అయిన కొన్ని ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేసింది.

అందులో స్కై బ్లూ కలర్ శారీకి ఆరెంజ్ కలర్ బ్లౌజ్‌తో పెయిరప్ చేసింది. ఇక పూలు పెట్టుకొని షార్ట్ హారంను వేసుకుంది. చెవులకు బుట్టాలు, చేతులకు గాజులు, వేలికి రింగ్ పెట్టుకుని చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు ఎప్పుడూ ఇలా పద్ధతిగా ఉండొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

"ఈ వయసులో అవసరమా?" అని అన్నవాళ్లకి ఇదే నా సమాధానం.. ట్రోలర్స్‌కి గట్టిగా ఇచ్చిపడేసిన ప్రగతి

Next Story