- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతడిని రెండో పెళ్లి చేసుకున్న నటి.. న్యూ బిగినింగ్స్ అంటూ ఎమోషనల్ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
నటి పావని రెడ్డి(Pavani Reddy) మొదట సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

దిశ, సినిమా: నటి పావని రెడ్డి(Pavani Reddy) మొదట సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే రియాలిటీ షో బిగబాస్‌లోనూ పాల్గొని 2వ రన్నరప్‌గా నిలిచింది. ఇక నటనపై ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ మూవీస్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాకుండా పలు షోస్‌లోనూ పాల్గొని సందడి చేసింది. చివరగా ఈ అమ్మడు అజిత్ కుమార్(Ajith Kumar) తునీవ్(Thunivu), చారీ111 వంటి సినిమాల్లో కనిపించింది. ఇక పావని రెడ్డి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
కానీ వీరి కాపురం సజావుగా సాగలేదు. ఏమైందో తెలియదు కానీ పావని మొదటి భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీంతో కొద్దికాలంపాటు డిప్రెషన్‌కు గురైన ఆమె మళ్లీ పలు షోస్‌లో మెరిసి సందడి చేసింది. ఇక కొరియేగ్రాఫర్ అమిర్(Amir), పావని మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెద్దలను కూడా ఒప్పించి పెళ్లి చేసుబోతున్నట్లు ఇటీవల పావని తన సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించింది. తాజాగా, పావని, అమిర్ ఘనంగా ఏప్రిల్ 20న పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయంగా జరిగిన వీరి పెళ్లికి పలువురు బంధు మిత్రులు, స్నేహితులు, సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఇక పెళ్లికి సంబంధించిన వీడియోను పావని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ‘8న్యూ బిగినింగ్స్ స్టార్ట్’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.






