- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NTR-Neel సినిమాలో మరో స్టార్.. హింట్ ఇచ్చిన నటుడు
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రం పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రం పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాను ప్రజెంట్ 'ఎన్టీఆర్-నీల్' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే, ఇప్పటి వరకు ఈ మూవీ టైటిల్ అధికారికంగా ప్రకటించకపోయినా ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ నటిస్తున్నారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా గోవాలో జరిగిన IFFI (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకలో ఈ ప్రాజెక్ట్ లో తన పాత్రను గురించి అడిగిన ప్రశ్నకు ‘‘ఇప్పుడు చెప్పే స్థితిలో లేను’’ అని టోవినో థామస్ పరోక్షంగా హింట్ ఇచ్చారు.






