- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందుకే అలాంటి టైటిల్ పెట్టాం.. నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను: రాజ్
మల్లేశం(Mallesham), 8 A.M. మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ రాచకొండ(Raj Rachakonda) నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొంది మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘23’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

దిశ, సినిమా: మల్లేశం(Mallesham), 8 A.M. మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ రాచకొండ(Raj Rachakonda) నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొంది మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘23’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ మూవీలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి(Venkat Sidda Reddy) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా.. ఈ సినిమాని రానా దగ్గుబాటి(Rana Daggubati) స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. తాజాగా, మూవీ మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు రాజ్ మాట్లాడుతూ.. ‘‘మంచి యాక్టర్స్ దొరకడం ఒక అదృష్టం. నాకు మల్లేశంలో అలాంటి మంచి యాక్టర్స్ దొరికారు. అనన్య(Ananya), దర్శి, పుష్పలో కేశవ అందరూ చాలా మంచి సినిమాలు చేస్తున్నారు. 23 సినిమాకి కూడా అలాంటి వారిని పొందాను.
మలయాళం సినిమాలకు ధీటుగా పెర్ఫామ్ చేసే యాక్టర్స్ దొరకడం నిజంగా అదృష్టం. ఝాన్సీ కాంట్రిబ్యూషన్‌ను మర్చిపోలేను. ఇందులో కూడా చాలా బరువైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో తేజా ది చాలా డిఫరెంట్ రోల్. చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. టీజర్‌లో చూపించినట్లుగా వీళ్ళ క్రైమ్‌తో చనిపోయిన వారు 23 మంది. అందుకే ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టాం. ఈ మూవీ హ్యూమన్ రైట్స్ వైపు ఉంటుంది. తప్పుని తప్పని తెలుసుకోవడం ఈ చిత్రం ఉద్దేశం. ఈ మూవీ హింసకు వ్యతిరేకంగా తీశాం. నేను జరిగినదే చూపించారు. బీనా చెప్పిన చాలా విషయాలు ఇందులో ఉంచాం. మూడు ఘటనలు జరిగాయి. చాలా మంది చనిపోయారు. అయితే చంపిన వారందరికీ సమానంగా శిక్ష పడిందా లేదా ? అనేది ప్రశ్న. జైలుకి వెళ్ళిన తర్వాత మనిషి పరివర్తన కూడా సినిమాలో చూపించాం. నేను కనెక్ట్ అయిన కథని చేయాలని భావిస్తాను. ఇప్పటివరకు చేసిన కథలన్నీ అలాంటివే’’ అని అన్నారు .






