- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kona Venkat : పవన్ నిర్మాతగా ఛాన్స్ ఇచ్చాడు.. కానీ ఆయనతో సినిమా నిర్మించను
కోన వెంకట్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాను, నాతో ఓ సినిమా నిర్మించు అన్నారు. కానీ అలా చేస్తే స్నేహంతో బిజినెస్ చేసినట్లు అవుతుంది అని ఆయన ఆఫర్ ను తిరస్కరించినట్లు ఈయన చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న కథా రచయిత, స్క్రీన్ ప్లే రైటర్లలో కోన వెంకట్ ఒకరు. ఈయన చాలా సంవత్సరాల నుండి సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు కథను, స్క్రీన్ ప్లేను అందించి చాలా విజయాలను అందుకున్నారు. కోన వెంకట్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి బయట పెద్దగా కనిపించకపోయినా వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు. తాజాగా కోన వెంకట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
అందులో పవన్ కళ్యాణ్ తో తనకున్న స్నేహబంధం ఎలాంటిది? ఆ ఫ్రెండ్ షిప్ కారణంగా పవన్ ఆయనకు ఏం ఆఫర్ చేశాడు? దానిని కోన ఎందుకు తిరస్కరించాడు? ఇలా అనేక విషయాలను ఈ కథా రచయిత తెలియజేశారు. కోన వెంకట్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి స్నేహితుడు. ఆయన నాకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. నాతో ఆయనకు ఉన్న స్నేహం కారణంగా ఒకసారి నేను నీకు డేట్స్ ఇస్తాను, నాతో ఒక సినిమాను నిర్మించు అన్నారు, కానీ నేను అది కుదరదు అని చెప్పాను.
అందుకు ప్రధాన కారణం... ఒక హీరోతో సినిమా చేస్తున్నాము అంటే అది వ్యాపారం. నాకు నచ్చిన స్నేహితుడితో నేను వ్యాపారం చేయలేను. అదే పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి నీ కథతో ఒక సినిమా చేయాలి అనుకుంటున్నాను అంటే ఒక కథను సిద్ధం చేసి ఆయనకు ఇస్తాను. అదే ఆయన కూడా ఒక నిర్మాతగా ఉండి నన్ను సహాయం చేయమంటే నేను సహాయం చేస్తాను. కానీ ఒంటరిగా మాత్రం ఆయనతో సినిమా నిర్మించను, అలా చేస్తే మా స్నేహానికి విలువేముంది అని కోనా వెంకట్ చెప్పుకొచ్చాడు.






