- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిటిల్ హార్ట్స్ హిట్ అయినా అందుకే వరుస సినిమాలను ఓకే చేయలేదు.. శివానీ నాగారం!
శివానీ నాగారం : 2024లో వెండితెరకు పరిచయం అయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాను. 2025లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాను. 2026లో కమర్షియల్ నటిగా మారిపోయాను. కెరీర్ నెమ్మదిగా ఉన్నా అద్భుతమైన స్థాయిలో ఉండాలని అనుకుంటున్నాను. నేను తాజాగా నటించిన హే భగవాన్ చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది.

దిశ, వెబ్ డెస్క్ : గాయని, కూచిపూడి నృత్యకారిణి అయిన శివానీ నాగారం "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్" అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. 2024వ సంవత్సరంలో విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను పొందింది. ఈ మూవీ తర్వాత శివానీ "లిటిల్ హార్ట్స్" సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ పోయిన సంవత్సరం విడుదల అయిన ఈ చిత్రం మొదటి రోజే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంది.
ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమె ఒక్కో సినిమాను ఎంచుకుంటూ కెరియర్ను చాలా స్లోగా ముందుకు సాగిస్తుంది. తాజాగా ఈ నటి సుహాస్ హీరోగా రూపొందిన హే భగవాన్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీని ఫిబ్రవరి 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. తాజాగా శివానీ ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొంది.
అందులో భాగంగా ఈమె మాట్లాడుతూ... "2024లో వెండితెరకు పరిచయం అయ్యి మంచి ప్రశంసలను అందుకున్నాను. 2025లో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకున్నాను. 2026లో నటిగా పూర్తి కమర్షియల్ హీరోయిన్గా మారిపోయాను. ఇలా మూడు సంవత్సరాలు నా కెరియర్ బాగా ముందుకు సాగింది. నేను వరుస పెట్టి సినిమాలు చేయడం లేదు. నేను చేసే సినిమాల సంఖ్య తక్కువగా ఉన్నా కూడా అందులో విజయాల సంఖ్య ఎక్కువగా ఉండాలనే దృష్టితోనే నా కెరీర్ను ముందుకు సాగిస్తున్నాను. తాజాగా నేను నటించిన హే భగవాన్ సినిమా కూడా అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని" శివానీ చెప్పుకొచ్చింది.






