అది వాయిస్ ఆ వోడ్కా నా.. అలా ఎక్కుతుంది మత్తు.. యంగ్ బ్యూటీ సింగింగ్‌కి ఫిదా అవుతున్న నెటిజన్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-02 12:18:26  IST  )

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల(Sree leela) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

అది వాయిస్ ఆ వోడ్కా నా.. అలా ఎక్కుతుంది మత్తు.. యంగ్ బ్యూటీ సింగింగ్‌కి ఫిదా అవుతున్న నెటిజన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల(Sree leela) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంది. మరో పక్క తన చదువులను కూడా కంప్లీట్ చేసుకుంటుంది. అయితే ఆ భామ డ్యాన్స్‌కు ఇండస్ట్రీలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. కానీ ఈ వీడియో చూస్తే తన సింగింగ్ టాలెంట్‌కు కూడా ఫిదా అయిపోవాల్సిందే. ఓ ఈవెంట్‌లో శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్‌గా అదరగొట్టింది. అది క్యూడా తన సింగింగ్‌తో.. ఇన్నాళ్లు ఈ ముద్దుగుమ్మకు నటనతో పాటు సూపర్ డ్యాన్సర్ అని పేరు ఉంది. ఇప్పుడు తనలోని మరో ట్యాలెంట్‌ని చూపించి మరోసారి ప్రేక్షకులందర్నీ ఆశ్చర్యపరిచింది శ్రీలీల.

గతంలో ‘స్కంద’(Skanda) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో థమన్‌తో కలిసి స్టేజిపై సాంగ్ పాడింది శ్రీ లీల. ఇలాంటి ఈవెంట్స్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తన టీంతో కలిసి సాంగ్స్ పెర్ఫార్మ్ చేస్తారనే సంగతి తెలిసిందే. అలా స్కంద ఈవెంట్‌లో కూడా తమన్(Thaman) తన టీంతో కలిసి ఈ సినిమాలోని సాంగ్స్‌ని పెర్ఫార్మ్ చేయగా సినిమాలోని చిట్టి చిట్టి.. అనే సాంగ్‌కి శ్రీలీల థమన్‌తో కలిసి స్టేజిపై పాడింది. ఇక ఈ భామ గాత్రానికి హీరో రామ్‌తో పాటు బాలయ్య బాబు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ అమ్మడు పాట పాడిన వీడియో ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో పై నెటిజన్లు అది వాయిస్ ఆ వోడ్కా నా.. అలా ఎక్కుతుంది మత్తు.. సింగర్ అయిపోవచ్చు కదా బ్యూటీ అని, మల్టీ టాలెంటెడ్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story