- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దిలో నా ఫేవరెట్ ఎపిసోడ్ అదే.. రామ్ చరణ్ కామెంట్స్‌తో పెరిగిన అంచనాలు
రామ్ చరణ్ మాట్లాడుతూ, ‘పెద్ది’ సినిమాలో నాకు ఢిల్లీ ఎపిసోడ్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కలిసి కారులో ప్రయాణిస్తూ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్న వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సంభాషణలో రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన తన ఫేవరెట్ ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ సినిమాలో నాకు ఢిల్లీ ఎపిసోడ్ చాలా ఇష్టం. నువ్వు చెప్పినప్పుడు ఎంత బాగుంది అనిపించింది, షూట్ చేసేటప్పుడు అంతకంటే మించి వచ్చింది. ముఖ్యంగా ఆ ట్విస్ట్ అదిరిపోయింది. ఢిల్లీ ఎపిసోడ్ చూసి ఆడియన్స్ తప్పకుండా సర్ప్రైజ్ అవుతారని నేను అనుకుంటున్నా” అని రామ్ చరణ్ చెప్పాడు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది.






