ఆ స్టార్ హీరోయిన్ కొత్త సినిమా అప్డేట్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-19 15:57:02  IST  )

బాలీవుడ్‌‌లో ఫ్రైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న కంగనా రనౌత్.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే సినిమాలు కూడా చేస్తోంది.

ఆ స్టార్ హీరోయిన్ కొత్త సినిమా అప్డేట్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్
X

దిశ, సినిమా: బాలీవుడ్‌‌లో ఫ్రైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న కంగనా రనౌత్ (Kangana Ranaut).. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే సినిమాలు కూడా చేస్తోంది. అంతేకాదు, సోషల్ మీడియాలో సైతం కంగనా నిత్యం యాక్టివ్‌గా ఉంటూ.. ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా 'ఇండస్ట్రీ ఒక డర్టీ ప్లేస్' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెట్టింట కంగనా కామెంట్లు విపరీతంగా వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఇది కాసేపు పక్కన పెడితే.. కంగనా తాజాగా తన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను అందించింది. ఆర్.మాధవన్ దర్శకత్వంలో లైట్ అనే సినిమాలో నటిస్తోంది. ట్రైడెంట్ ఆర్ట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టరును తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టరు నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story