- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Urvashi Rautela: ఆ స్టార్ హీరోకు రెండో జాతీయ అవార్డు రాబోతుంది.. ఊర్వశి ట్వీట్
అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule).

దిశ, సినిమా: అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule). ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాలీవుడ్ సినిమాల రికార్డులు అన్నింటిని బ్రేక్ చేస్తూ భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా చూసిన సినీ సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
తాజాగా, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela ) పుష్ప-2కు రివ్యూ ఇచ్చింది. ‘‘ఈ మూవీలోని ప్రతి ఒక్కరి నటన సూపర్‌గా ఉంది. సినిమాలోని జాతర సన్నివేశం చాలా బాగుంది. అల్లు అర్జున్ నటన కొత్త ఎత్తులకు ఎక్కినట్లుగా ఆ జాతర సీన్ పండింది. ఆ సీన్‌లోని ఆయన అత్యుత్తమ ప్రదర్శనకు, అద్భుతమైన నటనకు రెండో సారి జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకం కలుగుతుంది. తప్పకుండా ఈ సినిమాతో జాతీయ స్థాయిలో మరింత సత్తా చాటుతున్నారు. మూవీ టమ్ అందరికీ అభినందనలు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఊర్వశి ట్వీట్ వైరల్ అవుతుండగా.. కొందరు విమర్శలు చేస్తున్నారు.
Second National Award Loading for @alluarjun garu for his PEAK PERFORMANCE 🔥 Congratulations @SukumarWritings @MythriOfficial @iamRashmika entire team 🫶🏻🫶🏻#Pushpa2TheRule #Pushpa2 pic.twitter.com/NUTWG7Aaq7
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) December 9, 2024






