- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ స్టార్ బ్యూటీ వల్లే నా ఆలోచనల్లో మార్పు వచ్చింది.. అనన్య పాండే ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘లైగర్’(Liger) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘లైగర్’(Liger) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ఆకట్టుకున్నప్పటికీ అంతాగా ఫేమ్ రాలేదు. అయితే ఈ చిత్రం అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీంతో ఈ భామకు ఆఫర్లు కూడా రాలేదు. ఇక చేసేది ఏమీలేక టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసి బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది.
అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ దీపికా పదుకొణె(Deepika Padukone)పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాకు స్టార్టింగ్‌లో పలు సవాళ్లు తప్పలేదు. కెరీర్ ప్రారంభంలో సెట్స్‌లో ఏది చెప్తే అది చేసేదాన్ని.
అంతే తప్ప.. మన అవసరాలు, సమస్యల గురించి నిర్మొహమాటంగా, ధైర్యంగా చెప్పాలి అనే విషయం నాకు తెలియదు. అలా ఉంటేనే మనకంటూ అండగా నిలబడే వ్యక్తులు ఉన్నారన్న విషయం నాకు ‘గెహ్రియాన్’(Gehrian) సినిమా సెట్‌లో అర్థమైంది. ఆ మూవీలో నా సహ నటి దీపికా పదుకొణె నటించింది. ఆమె సెట్లో ప్రతి ఒక్కరికీ అండగా నిలబడేది. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించేది.
అందరితోనూ మర్యాదపూర్వకంగా వ్యవహరించేది. ఆమె స్టార్ హోదాలో ఉంది అయినా కూడా తనలో కొంచెం కూడా గర్వం కనిపించదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న జీవిత సూత్రం ఆమె నుంచే నేర్చుకున్నాను. ఇంకా చెప్పాలి అంటే దీపిక వల్లే నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనన్య పాండే చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






