ఆ స్టార్ నటుడు నన్ను టార్గెట్ చేసి మానసిక క్షోభకు గురి చేశాడు.. దుమారం రేపుతున్న నటి కామెంట్స్

by Mallepaka Hamsa |

న్ను ఇండస్ట్రీలో 'జిహాదీ' అని పిలుస్తూ తప్పుడు ప్రచారం చేశారు. నేను మత మార్పిడులకు పాల్పడుతున్నానంటూ లేనిపోని రూమర్లు సృష్టించారు." అని అన్సీబా ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ స్టార్ నటుడు నన్ను టార్గెట్ చేసి మానసిక క్షోభకు గురి చేశాడు.. దుమారం రేపుతున్న నటి కామెంట్స్
X

దిశ, సినిమా: మలయాళ ఇండస్ట్రీలో వివాదాలు రోజురోజుకూ మరింత ముదురుతున్నాయి. జస్టిస్ హేమ కమిటీ నివేదిక అనంతరం ఇండస్ట్రీలోని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండగా.. తాజాగా బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’ ఫేమ్ నటి అన్సీబా హాసన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మలయాళ నటీనటుల సంఘం ‘అమ్మ’ లో జాయింట్ సెక్రటరీగా పనిచేసిన అన్సీబా, ఫిబ్రవరిలోనే తన పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చి తాను రాజీనామా చేయడానికి గల అసలు కారణాలను బయటపెట్టారు. సహనటుడు టినీ టామ్తనపై వ్యక్తిగతంగా, మతపరంగా తీవ్రమైన వేధింపులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. "నన్ను ఇండస్ట్రీలో 'జిహాదీ' అని పిలుస్తూ తప్పుడు ప్రచారం చేశారు. నేను మత మార్పిడులకు పాల్పడుతున్నానంటూ లేనిపోని రూమర్లు సృష్టించారు." అని అన్సీబా ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితంపై, క్యారెక్టర్‌పై అసోసియేషన్ సభ్యులే తప్పుడు కథనాలు అల్లారని, ఒక ముస్లిం మహిళ అయినందుకే తనను ఇలా టార్గెట్ చేశారా? అని ఆమె ప్రశ్నించారు.

ఈ మానసిక క్షోభ భరించలేకే తాను 'అమ్మ' నుండి తప్పుకున్నట్లు అన్సీబా తెలిపారు. ఈ వేధింపులపై అసోసియేషన్ పెద్దలకు ముందే సమాచారం ఇచ్చినప్పటికీ, ఎవరూ తనకు అండగా నిలబడలేదని, పైగా ఒక మహిళా ఎగ్జిక్యూటివ్ మెంబర్ తనపైనే తప్పుడు పోలీస్ కేసు పెట్టించారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోదలచుకోలేదని, కేవలం ప్రశాంతత కోసమే ఇండస్ట్రీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని కన్నీరు పెట్టుకున్నారు. అయితే అన్సీబా ఆరోపణలను నటుడు టినీ టామ్ తీవ్రంగా ఖండించారు. ఇదంతా కేవలం ఎవరో చెప్పిన మాటలు విని చేస్తున్న ఆరోపణలని కొట్టిపారేశారు. "నా స్నేహితుల్లో చాలామంది ముస్లింలు ఉన్నారు. స్టేజ్ షోలు, ఈవెంట్లు నిర్వహించేటప్పుడు ఒత్తిడిలో ఒకరిపై ఒకరు అరుచుకోవడం సహజం, అంతేకానీ నేను ఎప్పుడూ అలాంటి మతపరమైన వ్యాఖ్యలు చేయలేదు" అని ఆయన అనడం గమనార్హం.

Next Story